పార్టీకి నష్టం జరిగేలా ఎవరు మాట్లాడినా చర్యలు: కుంతియా

Submitted by arun on Fri, 09/21/2018 - 15:07
rcraja

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వీహెచ్ వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా. పార్టీకి నష్టం జరిగేలా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌కు పట్టిన పెద్ద శని అంటూ ధ్వజమెత్తారు. కమిటీల ఏర్పాటుపై తాను ఫోన్‌లో కుంతియాను నిలదీశానన్నారు. పని చేసేవాళ్లను పట్టించుకోకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని వ్యాఖ్యానించారు. పైరవీకారులకు టిక్కెట్లు ఇస్తే పార్టీకే నష్టమని రాజగోపాల్‌రెడ్డి హితవు పలికారు.

English Title
Telangana Congress In-Charge RC Khuntia Responds on Komatireddy Rajagopala reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES