39 మంది ఎమ్మెల్యేల‌కు సీఎం కేసీఆర్ వార్నింగ్‌

Submitted by arun on Thu, 06/07/2018 - 15:01
kcr

39 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీరిలో చాలా మంది టికెట్ కోల్పోయే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...వీరిలో పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు స్వయంగా వారితోనే చెప్పించారట. పార్టీ బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉందని సమాచారం. సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కొన్ని సర్వేల ద్వారా తెలుకున్నారట. ఈ సర్వేలో వచ్చిన సమాచారం మేరకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మార్చుకోవాలని సీఎం వారికి సూచించారట. పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని... వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మీ ప‌నితీరు మార్చుకుంటే బాగుంటుంద‌ని, లేక‌పోతే వచ్చే ఎన్నిక‌ల్లో ప‌క్క‌పెట్టాల్సివ‌స్తుంద‌ని కేసీఆర్ హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది.  అయితే ఆ 39 మంది ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నేది బ‌య‌ట‌కు రాలేదు. 

English Title
telangana cm kcr warns to party mlas

MORE FROM AUTHOR

RELATED ARTICLES