ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సీఎం కేసీఆర్ సంకేతాలు...సెక్రటేరియట్ బాట పట్టిన...

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సీఎం కేసీఆర్ సంకేతాలు...సెక్రటేరియట్ బాట పట్టిన...
x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఎన్నిలకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తున్నారా ? సెక్రటేరియట్ లో సందడి...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఎన్నిలకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తున్నారా ? సెక్రటేరియట్ లో సందడి వాతావరణం చూస్తూ ఇదే నిజమే అనిపిస్తోంది. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రులు, అధికారుల చుట్టూ ఎమ్మెల్యేలు ప్రదక్షిణలు చేస్తున్నారు.

జమిలి ఎన్నికలకు జై అన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ముందస్తు లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగిన సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెక్రటేరియట్ కు వస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కోరుతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల రాకతో ఎప్పుడులేనంతా సందడి వాతావరణం సెక్రటేరియట్ లో కనిపిస్తోంది. మంత్రులు, అధికారులతో ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి పనుల గురించి చర్చిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డితో సమావేశమైన వేముల వీరేశం, అంజయ్య యాదవ్ సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.

సాధారణ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనే సంకేతాలు ఉన్నాయని ఆంధోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలనే ఆదేశాలు కూడా అందుకున్నామంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కూడా సచివాలయానికి వస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వచ్చారు. తమ నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గాల్లోని పనులు త్వరితగతిన పూర్తి చేసి సీఎం కేసీఆర్ తో శభాష్ అనిపించుకోవాలని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారు. మరోసారి తమ సీటును పదిలం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories