ముఖ్యమంత్రి ముఖ్య పనులపై...

Submitted by arun on Fri, 08/03/2018 - 14:49
kcr

ఢిల్లీకి బయలుదేరే ముఖ్యమంత్రి గారు,

మూడు రోజులు అక్కడే పనులు జోరు,

జోనల్ విధానాలు కోసమడిగే మంజూరు,

ఇక చెయ్యండి అనే విభజన హామీల షురు.శ్రీ.కో

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల వరకు ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం కాబోతున్నారు.ఈయనతో భేటీ లో ప్రదానంగా హైకోర్టు విభజన అంశంపై చర్చించనున్నారు. విభజన చట్టంలో హైకోర్టు విభజనపై స్పష్టత ఉన్నప్పటికీ అనవసర జాప్యం జరుగుతుందని తెలుపనున్నారు. అలాగే ఇటీవలి అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉంది.
 

English Title
telangana cm kcr camp delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES