విద్యార్థుల చావుకు కారకులు వారే : నాగబాబు సంచలన వ్యాఖ్యలు

విద్యార్థుల చావుకు కారకులు వారే : నాగబాబు సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఇటివలే రెండు తెలుగురాష్ట్రాల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే...

ఇటివలే రెండు తెలుగురాష్ట్రాల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఫలితాలు చూసుకున్న విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే మరోసారి సప్లీ రూపంలో అవకాశం ఉన్నా కానీ ఆలోచించకుండా క్షణీకావేశంతో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఈ నేఫథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రముఖ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమాయకమైన పసిమొగ్గలు ఇలా చిన్న చిన్న కారణాలకు చనిపోవడానికి కారణం కొందరు తల్లిదండ్రుల ఆలోచన తీరు, కొన్ని విద్యాసంస్థల స్వార్థచింతనే అనే మండి పడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు తన ప్రత్యేక యూట్యూబ్ చానల్ ద్వారా మాట్లాడారు.

తాను తాజాగా విడులైన ఫలితాలపై మాట్లాడుతూ ఎవో మార్కులు తక్కువ వచ్చాయని లేదా ఏదో ఒక సబ్జెక్ట్‌లో ఫేయిల్ అయ్యానని చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతిగంటకు ఒక విద్యార్థి ఆత్మహత్యలకు పాల్పడుతున్నరని అన్నారు. అయితే విద్యార్థులు ముఖ్యంగా చనిపోవడానికి గల కారణం వాళ్లు రాసిన పరిక్షల్లో వారు అనుకున్నంత రాయకపోవడమో లేక ఫేయిల్ అయితామో అని భయంతోననే చనిపోతున్నరని దీనికంతటి కారణం ఎవరు అని నాగబాబు ప్రశ్నిస్తూ ముఖ్యంగా తల్లిదండ్రల ఆలోచన తీరు మారాలన్నారు. ఏం ఈ భూమ్మీద ఒక చదువే ఉందా? అసలు భూమిమీద బతకడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చదువు అనేది ఒక భాగం తప్ప జీవితం మొత్తం చదువుపై ఆధారపడదని మొదట తల్లిదండ్రుల ఆలోచన తీరు మారలన్నారు.ఎవరికో మొదటి ర్యాంక్ వస్తే తమ పిల్లవాడికి రావాలనీ పిల్లోడి మీద రుద్దడం ఎంటనీ అన్నారు. ఇలాంటిఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఎమీ ఆలోచించకుండా చనిపోతున్నారని మండిపడ్డారు. దేశంలో డాకర్టు, ఇంజనీర్లు ఉద్యోగాలు తప్ప వేరే జాబ్స్ లేవా? అని మండిపడ్డారు. ఏ బిడ్డ చనిపోయినా అందరికీ అవమానమే అని తన ఆవేదనను యూట్యాబ్ ద్వారా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories