ఈ నెల 6న ముందస్తు కేబినెట్‌...పలు కీలక...

Submitted by arun on Tue, 09/04/2018 - 08:53
Telangana Cabinet

తెలంగాణ కేబినెట్‌ మరోసారి భేటీకానుంది. ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ శాసనసభ రద్దుకు సిఫార్సు చేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో రెండు రోజుల్లో జరగనున్న కేబినెట్ సమాశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలనపరమైన నిర్ణయాల కోసం ఒకసారి..  శాసనసభను రద్దు చేసే తీర్మానం చేయడానికి మరోసారి మంత్రిమండలి భేటీకానుందని ప్రచారం జరిగింది. అయితే, చివరికి మాత్రం ఒక సమావేశమే ఉండొచ్చని ఈ భేటీలోనే పలు విధానపరమైన నిర్ణయాలతోపాటు అసెంబ్లీ రద్దుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నెల 2న ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో రెండు, మూడు రోజుల్లో మరోసారి సమావేశమవుదామని సీఎం కేసీఆర్, మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలలోగా సమాచారం అందించాలంటూ అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈసారి జరిగే సమావేశంలో ముందస్తుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
 
ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఉద్యోగులకు మధ్యంతర భృతి అంశం ప్రధానమైంది. దీనికి మంత్రిమండలి ఆమోదం అవసరం లేదని, ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ  రేపు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే.. అదే రోజు ఐఆర్‌ ఉత్తర్వు జారీ అయ్యే వీలుంది. ఐఆర్‌ అంశం తేలిపోయాక 6న మంత్రిమండలి సమావేశంలో దాన్ని ఆమోదించే అవకాశం ఉంది. అదే రోజు శాసనసభ రద్దుకు సిఫార్సు చేయవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

పలు వర్గాలకు మరోసారి వరాల జల్లు కురిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందస్తు ఖాయం అయితే, ఎన్నికల నజరానాలు భారీగానే ఉంటాయని ఉద్యోగ సఘాల్లో ఆసక్తి పెరిగింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరగుతున్న సమయంలో మధ్యంతర భృతి అంచనాలకు మించి ఉండవచ్చు. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుదని ఎదురుచూస్తున్నారు. 
 
అసెంబ్లీ రద్దు చేసే విషయంపై నిర్ణయం తీసుకొనేలోపు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన.. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం ఉంది. అయితే,  అసెంబ్లీని రద్దు చేయాలంటే కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమే ప్రధానంగా ఎజెండాగా మారే అవకాశం లేకపోలేదు. 

English Title
Telangana Cabinet to meet again

MORE FROM AUTHOR

RELATED ARTICLES