ఇరకాటంలో పడిన తెలంగాణ బీజేపీ

Submitted by arun on Fri, 02/09/2018 - 10:10
telangana bjp leaders

తెలంగాణ బీజేపీకి, జాతీయ పార్టీ వ్యూహాలు అర్థం కాక నానా అవస్థలు పడుతోందా...? ఎప్పుడు విభజన అంశంపై మాట్లాడినా.. తెలంగాణ బీజేపీ విమర్శలు పడాల్సి వస్తుందని పార్టీ మదనపడుతోందా..? ప్రధాని మోడి పార్లమెంటులో విభజన అంశం మాట్లాడిన తీరు.. తెలంగాణలో పార్టీని ఇరకాటంలో పడేసిందని ఇక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారా..? అవుననే అనిపిస్తున్నాయి తాజా పరిణామాలు. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనని..  ఇక రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని కమలంనేతలు గొప్పలు చెప్పుకున్నారు. కనీసం వచ్చే ఎన్నికల తరువాత పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలోనైనా ఉంటామన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీకి భవిష్యత్తులేదని.. టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యమ్నాయమని కమలం పార్టీనేతలు చెప్పారు.  జాతీయపార్టీ పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తోందని.. కాంగ్రేస్, టిఆర్ఎస్ నుంచి జోరుగా తమ పార్టీలోకి వలసలు ఉంటాయని నేతలు లీక్ లు ఇచ్చారు. 

అయితే, ఇదంతా ఉట్టి ప్రచారమేనని.. పార్లమెంటులో ప్రధాని ప్రసంగం తరువాత తేలిపోయింది. ప్రధాని మోడి మాట్లాడిన తీరు చూస్తే, తెలంగాణ బీజేపీపై జాతీయపార్టీకి ఏ మాత్రం దృష్టిలేదని తేలిపోయింది. ఆయన మాట్లాడిన ప్రతి మాట తెలంగాణ పార్టికి నష్టం కలిగేలా ఉన్నాయని సొంత పార్టీనేతలే మదనపడుతున్నారు. విభజన సమయంలో ఆంద్రకు అన్యాయం చేశారని కాంగ్రేస్ ను విమర్శించినా.. తెలంగాణలో తమ పార్టీ తెలంగాణ కోసం ఉద్యమించింది. బిల్లుకు తమ పార్టీ మద్దతిచ్చిందనే సంగతి మరిచారని తెలంగాణ కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 
 
ప్రధాని స్థాయిలో ఉన్న మోడి పదే పదే ఆంద్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ప్రసంగిస్తే.. తెలంగాణలో ఉన్న పార్టీ పరిస్థితి ఏమిటిని అంటున్నారు ఇక్కడి కమలం నేతలు. ఇప్పటికే ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రం. దీనికి తోడు ప్రధాని ఏపి వైపు మొగ్గుచూపుతే, తాము రాష్ట్రంలో ఎలా ఎదుగాలని చర్చించుకుంటున్నారు. ప్రధానే ఇటాంటి ప్రసంగాలు చేస్తే.. రాష్ట్రంలో పార్టీ సంగతేంటని ఏంటని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే.. చాలా మంది నేతలు పార్టీని వీడడానికి ప్రయత్నిస్తుంటే, ఇలాంటి సమయంలో ప్రధాని ప్రసంగం తమను బలహీనపరిచేలా ఉందని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. విభజన సమయంలో జరిగిన అంశాలను ప్రస్తావించి.. మానిన గాయాన్ని మళ్లీ గుర్తుచేయడం సరికాదని మదనపడుతున్నారు. తెలంగాణ బీజేపీకి ప్రస్తుతం.. కక్కలేని, మింగలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని చేసిన వాఖ్యలను విమర్శించలేక.. వాటికి మద్దతియ్యలేక, ఏం చేయాలో తెలియక ఇప్పటి వరకు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తుందో వేచిచూడాలి.

English Title
telangana bjp leaders unhappy with budget

MORE FROM AUTHOR

RELATED ARTICLES