నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ఉత్కంఠ

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికపై ఉత్కంఠ
x
Highlights

దేశం యావత్తు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానం ఎన్నిక నిర్వాహణ ఈసీకి కత్తిమీద సాముల మారింది....

దేశం యావత్తు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానం ఎన్నిక నిర్వాహణ ఈసీకి కత్తిమీద సాముల మారింది. అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలా..? లేదా ఈవీఎంలు ఉపయోగించాలా అనే అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. రాష్ర్ట ఎన్నికల అధికారులు మాత్రం ఏవిధంగానైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమే అంటున్నారు.

తమ సమస్యను జాతీయస్థాయిలో ప్రతిబింబించడం కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున్న నామినేషన్లు దాఖలు చేయడంతో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఉత్కంఠంగా మారింది. భారీ సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఇక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల నిర్వాహాణపై అధికారులు తర్జన బర్జన పడుతున్నారు.

తెలంగాణలో రెండు కంపెనీలకు చెందిన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెల్ఎం3 ఒకటి కాగా బీహెచ్ఈఎల్ కు చెందిన మరో ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎం లేదా బ్యాలెట్ ఏ విధానంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెబుతున్నారు. అయితే ఎన్ని ఈవీఎంలు అవసరం పడుతాయో లెక్కతేల్చే పనిలో పడ్డారు. నిజామబాద్ పార్లమెంట్ ఎన్నిక నిర్వాహణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories