ఈ నగరానికి ఏమైంది?... ఓటేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీ!

ఈ నగరానికి ఏమైంది?... ఓటేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీ!
x
Highlights

మంచి నేతలను ఎన్నుకోవాలన్న సంకల్ప దీక్షతో ఓటు ముడుపుకట్టే మహాక్రతువే పోలింగ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ శాతం చదువుకున్నవారే. అంతా హై...

మంచి నేతలను ఎన్నుకోవాలన్న సంకల్ప దీక్షతో ఓటు ముడుపుకట్టే మహాక్రతువే పోలింగ్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ శాతం చదువుకున్నవారే. అంతా హై ప్రొఫెషనల్సే. అయినా పోలింగ్ లో మాత్రం, మారుమూల పల్లెజనాల కన్నా అధ్వాన్నంగా మారిపోయారు. భవిష్యత్తును నిర్దారించే ఓటుహక్కును వినియోగించడంలో మరోసారి బాగ్యనగరం బద్దకించింది.

ఓటు హక్కు వినియోగంలో దాదాపుగా అన్ని ప్రధాన నగరాలు ఒకదానికొకటి పోటీపడుతుంటే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం గతంలో కన్నా పోలింగ్ శాతం తగ్గుతోంది. చదువుకున్నవారు, ఓటు విలువ తెలిసినారు కూడా పోలింగ్ కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఒక్క ఓటుతో దేశ చరిత్ర మారుతుందా నేనొక్కడిని ఓటేయకపోతే వచ్చే నష్టమేంటి అయినా, అసలు నేనెందుకు ఓటేయాలి. ఇలాంటి ప్రశ్నలే చాలా మందిలో తలెత్తుతాయి. ప్రభుత్వాలు కూలిపోవడానికి కొత్త చరిత్రకు నాంది పలకడానికి ఒక్క ఓటు చాలు. అలాంటి ఓటును వినియోగించుకోవడంలోనూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం.

గ్రేటర్ హైదరాబాద్ లోని సగం మంది ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవడంపై చూపిన శ్రద్ధ, పోలింగ్‌పై చూపించలేదు. ఓటు గుర్తింపు కార్డును కేవలం ఐడీ ఫ్రూప్ లానే ఫీలవుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేయాలన్న కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం సొంత గ్రామాలకు క్యూకట్టిన తీరును అందరం చూశాం. గ్రామీల ప్రాంతాల్లోనే ఇంత చైతన్యం వెల్లివిరిస్తే మరి, హైటెక్(ఒత్తిచడవండి) నగరంలో ఉంటున్న గ్రేటర్ ఓటర్లకు ఏమైంది..?

ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రేటీస్ సైతం తీరిక చేసుకుని, ఓటు వేయడానికి సమయం కేటాయింటారు. తమ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో వెతుక్కంటూ వెళ్లి.. సామాన్య ప్రజల్లా ఓట్లు వేశారు. మరోవైపు, ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు సైతం తమ గ్రామాలకు వెళ్లి ఓటు వేసి వచ్చారు. అలాంటిది, హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఉద్యోగులకు, సామాన్య ఓటర్లకు వచ్చిన ఇబ్బంది ఏంటి.? కనీసం, వయోవృద్ధులు, దివ్యాంగులను చూసైనా, గ్రేటర్ ఓటర్లు బద్దకం వీడాలి. బాధ్యతను తెలుసుకోవాలి. ఓటర్ల జాబితాలో ఉన్నవాళ్లలో సగం మంది అసలు ఓట్లే వేయకపోవడం ఎంత దారుణం.

హైదరాబాద్ శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇలాకా. పర్యాటక, వ్యాపార కేంద్రం. మన నగరానికి ప్రపంచపటంలోనే ఒక ప్రత్యేకమై స్థానం ఉంది. ఇంతటి మహానగరం.. ఓటు హక్కు వినియోగంలో మాత్రం వెనుకంజలో ఉంది. మీ వేలికున్న సిరాచుక్కను చూసి చార్మినారే మురిసిపోవాలి. గోల్కొండ విజయగర్వంతో రంకెలేయాలి. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడమే నగరానికి మనం ఇచ్చే తొలి కానుక. ఓటు హక్కు ఉన్నవారంత పోలింగ్ లో పాల్గొని ఓటు ఆయుధాన్ని వినియోగిస్తే, నగర తలరాతను నిర్దేశించవచ్చు. మంచి పాలకులను ఎన్నుకోవచ్చు. మీ ఒక్క ఓటే, అవినీతి మేతగాళ్ల మూతికి చిక్కంకావచ్చు. అసమర్థ నాయకుల మెడకు గుదిబండ అవ్వొచ్చు. అసమర్థ నేతలకు శాశ్వత ముగింపు పలకొచ్చు. గ్రేటర్ ఓటర్లు లారా మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రాణత్యాగాలు చేయనవసరం లేదు. జీవితాలను పణంగా పెట్టనక్కర్లేదు. ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కును సక్రమంగా వినియోగిస్తే చాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories