చాలా రోజుల తర్వాత ప్రగతి భవన్ కి హరీష్ రావు..

చాలా రోజుల తర్వాత ప్రగతి భవన్ కి హరీష్ రావు..
x
Highlights

కారు పదహరు సర్కారు అనే నినాదంతో ముందుకు వెళ్ళిన టీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ నే ఇచ్చాయి.. దీనితో తొమ్మిది స్థానాలకు మాత్రమే...

కారు పదహరు సర్కారు అనే నినాదంతో ముందుకు వెళ్ళిన టీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ నే ఇచ్చాయి.. దీనితో తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది టీఆర్ఎస్ .. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపిలు అనూహ్యంగా పుంజుకున్నాయి ..

అయితే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరవాత హరీష్ రావు కేసీఆర్ నివాసం అయిన ప్రగతి భవన్ కి వెళ్ళింది లేదు ..కానీ నిన్న హఠాత్తుగా సీఎం కేసీఆర్ కోరిక మేరకు వెళ్లి కలిశారు హరీష్ రావు .. పార్లమెంట్ ఫలితాలపై ఇద్దరు సమాలోచనలు జరిపారు. మళ్లీ హరీష్ కు పార్టీలో కీలక స్థానం కట్టబెట్టేందుకు.. ఓటములు వ్యతిరేతకలను తగ్గించేందుకు కేసీఆర్ నడుం బిగించారన్న చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది.

దీంతో హరీష్ రావును త్వరలోనే కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఇక పార్లమెంట్ లో ఓటమిని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో పనిచేయని మంత్రుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రులపై వేటు కూడా వేసే అవాకాశాలున్నాయని సమాచారం. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ స్థానాల్లో మంత్రులుగా సరిగా పనిచేయని వారిని తొలగించి కొత్తవారిని తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories