డిప్రెషన్ కి గురి అయ్యాను అని చెబుతున్న చిరు హీరోయిన్

డిప్రెషన్ కి గురి అయ్యాను అని చెబుతున్న చిరు హీరోయిన్
x
Highlights

తెలుగులో 'అశోక్', 'జై చిరంజీవ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాల లో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సమీరా రెడ్డి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా...

తెలుగులో 'అశోక్', 'జై చిరంజీవ', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాల లో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సమీరా రెడ్డి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆఫర్లు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో పెళ్లి చేసుకుని వెంటనే ఒక బిడ్డకు తల్లి కూడా అయింది సమీరారెడ్డి. నిజానికి బాబు పుట్టిన తర్వాత కొన్నాళ్లకే సమీరారెడ్డి ఇండస్ట్రీలోకి అడుగు పెడదామని అనుకున్నారు కానీ ఒక ఐదు నెలల పాటు తాను ఒక వ్యాధి వల్ల బెడ్ కే పరిమితమైపోయాను అని చెప్పుకొచ్చింది సమీరారెడ్డి. ఆ సమయంలో వర్కౌట్స్ చేసేందుకు వీలు పడలేదని, ఇంట్లోనే ఉండటంతో 102 కేజీలు పెరిగిపోయాయని చెప్పింది సమీరారెడ్డి.

"ఆ సమయంలో ఈమె హీరోయిన్ సమీరారెడ్డి నేనా ఇలా అయిపోయిందేంటి అంటూ కొందరు చేసిన కామెంట్ల వల్ల నేను డిప్రెషన్ కి కూడా గురయ్యాను. నాకు చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చేవి. మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులను కూడా సంప్రదించాను. ఆ సమయంలో వారు ఇచ్చిన సలహాలు మరియు సూచనలు వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రెండవ సారి గర్భవతిని అయ్యాను అన్న విషయాన్ని చాలా సంతోషం గా చెబుతున్నాను. రెండవ బిడ్డ జన్మించిన తర్వాత బరువు తగ్గడానికి ప్రయత్నిస్తాను." అని తెలిపారు సమీరా రెడ్డి. మరి ఈమె తిరిగి సినిమాల లోకి ఎప్పుడు వస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories