జడ్పీ సమావేశంలో రగడ..ఎమ్మెల్యే మీదకు నేమ్ ప్లేట్స్‌ విసిరిన సుబ్రహ్మణ్యం

Submitted by arun on Thu, 05/24/2018 - 14:11

ప్రొటోకాల్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి సభ్యుల మధ్య రసాభాసకు దారి తీసింది. కడప నగరంలో జడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ గూడూరు రవి అద్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే ప్రొటోకాల్ పై చర్చ జరిగింది. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను కాదని.., ఓటమి పాలైన వరదరాజుల రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలి వివాదానికి దిగారు. చివరి కలెక్టర్‌ హరికిరణ్‌ జోక్యం చేసుకోవడంతో... వివాదానికి తెరపడింది. అధికారులు ప్రొటోకాల్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.
 

English Title
TDP, YSRCP Leaders Fight

MORE FROM AUTHOR

RELATED ARTICLES