టీడీపీ కోడ్ ఉల్లంఘనను పట్టించునేదెవరు?

Submitted by hmtvdt on Mon, 04/30/2018 - 11:42
TDP violates election code?

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. ఏ ఉద్దేశంతో సభ నిర్వహిస్తున్నా కూడా.. టీడీపీ నేతలు మాత్రం ఓ విషయాన్ని మరిచిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తో పాటు.. ఇతర నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు.

ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోవడంతో.. ఎన్నిక వచ్చింది. ఈ నెల 22 నుంచి 29 వరకూ కోడ్ అమల్లో ఉంది. వాస్తవానికి సభ జరిగేది 30వ తేదీనే. కానీ.. అంతకు ముందే.. తిరుపతి వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు నానా హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు పాల్గొనే సభ కాబట్టి.. తెలుగు తమ్ముళ్లైతే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.

తిరుపతి మొత్తాన్ని పసుపుమయం చేసేస్తున్నారు. ఎటు చూసినా.. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఇది చూసి.. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుపతిలో దిగుతున్న భక్తులు కూడా.. ముందు ఫ్లెక్సీలో చంద్రన్న దర్శనం చేసుకోవాల్సి వస్తోంది. అక్కడే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పై చర్చ కూడా జరుగుతోంది.

రాష్ట్రానికి పనికొచ్చే విషయంలో చేస్తున్నాం కాబట్టి.. ఈ సభకు ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని తెలుగు తమ్ముళ్లు సమర్థించుకుంటారేమో కానీ.. సభకు ముందు రోజుల్లో చేసిన హడావుడి కూడా ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇలా వ్యవహరించడం తప్పు.. అన్నది టీడీపీ వాళ్లకు తెలియదా.. అని సగటు వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు. ఈ ఉల్లంఘనకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నాడు.

English Title
TDP violates election code?

MORE FROM AUTHOR

RELATED ARTICLES