logo

సైకిల్ దూకుడు

సైకిల్ దూకుడు

కేంద్రం ఇచ్చిన విభజన హామీల కోసం,
ఆందోళన రోజు రోజు పెంచెను సైకిలు,
ఎలాగైనా ఇక కడప ఉక్కు కర్మాగారం,
ఏర్పాటు చేయాలనేదె వారి వకీలు. శ్రీ.కో

విభజన హామీల సాధనలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ రాష్ట్రపతికి విన్నవించారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లైవ్ టీవి

Share it
Top