మహాకూటమిలో పట్టుబట్టి 14 సీట్లు దక్కించుకున్న టీడీపీ చివరకు...

Submitted by arun on Mon, 11/19/2018 - 17:50
mk

మహాకూటమిలో పట్టుబట్టి 14 సీట్లు దక్కించుకున్న టీడీపీ చివరకు 13 స్ధానాలకే పరిమితమైంది. చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో  పఠాన్ ‌చెరుకు అభ్యర్ధి ఖరారు కాలేదు. దీంతో 13 స్ధానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇదే స్ధానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దిగింది. పొత్తులో భాగంగా స్ధానం కేటాయించిన పోటీ చేయక పోవడంపై  స్ధానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి నందీశ్వర్ గౌడ్ పార్టీ టికెట్ ఆశించారు. ఇందుకోసమే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే ప్రజా కూటమి ప్రయోజనాల కోసమే పోటీ చేయలేదని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిస్తామంటూ ఆయన ప్రకటించారు . 

Tags
English Title
tdp seats in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES