బీజేపీతో క‌టిఫ్..చంద్ర‌బాబు అధికారిక ప్ర‌క‌ట‌నే కీలకం..?

బీజేపీతో క‌టిఫ్..చంద్ర‌బాబు అధికారిక ప్ర‌క‌ట‌నే కీలకం..?
x
Highlights

యూపీ ఉప ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోక ముందే… బీజేపీకి ఆంద్రప్రదేశ్ లో మరో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. రాష్ట్రానికి...

యూపీ ఉప ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోక ముందే… బీజేపీకి ఆంద్రప్రదేశ్ లో మరో ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేబినెట్ పెదవులని తృణప్రాయంగా త్యజించిన టీడీపీ ఇక బీజేపీ కూటమిలో కూడా కొనసాగరాదని నిర్ణయించింది. కమలం పార్టీతో పూర్తిస్థాయిలో ‘కటీఫ్‌’ చెప్పాలని నిర్ణయించింది. ఎన్డీయే కూటమి నుంచి తక్షణం బయటకు రావాలని నిర్ణయించుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై అధికారికమైన ప్రకటన చేయనున్నారు. గురువారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో కొందరు మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేంద్రం వైఖరితో విసిగిపోవడంవల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి నుంచి మాత్రం బయటకు రాకుండా టీడీపీ నిగ్రహం పాటించింది.
రాష్ట్రానికి సంబంధించి తాము లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి మరికొంత సమయం వేచి చూడాలని భావించింది. పార్లమెంటులో బడ్జెట్‌ తుది ఆమోదం పొందేలోపు రాష్ట్రానికి ఏవైనా ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూసింది. కానీ… ఆశించింది జరగలేదు. కేంద్ర బడ్జెట్‌ను కూడా బుధవారం సభ్యుల ఆందోళనల నడుమే హడావుడిగా ఆమోదించేశారు. పార్లమెంటు సమావేశాలను శుక్రవారం నిరవధికంగా వాయిదా వేసే అవకాశముందని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. తాము కోరినవేవీ బడ్జెట్‌లో చేర్చకుండా ఫైనాన్స్‌ బిల్లును ఆమోదించడంతో… ఇంకా వేచి ఉండటంలో అర్థం లేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ నాయకత్వం తమను ఇతరులతో తిట్టించే పని కూడా మొదలుపెట్టిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆకస్మికంగా రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించడం వెనుక బీజేపీ ఉందని బలంగా భావిస్తున్నారు. బీజేపీ తన ఎత్తులు తాను వేస్తున్న తర్వాత ఇంకా ఎన్డీయే కూటమిలో ఉండటం అర్థం లేనిదని అభిప్రాయపడుతున్నారు. సీఎం గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. కూటమి నుంచి బయటికి రావాలన్న అభిప్రాయానికి భేటీలో పాల్గొన్న మంత్రులు మద్దతు పలికారు.
అయితే ఒక్క మునిసిపల్‌ మంత్రి నారాయణ మాత్రం ఇంకా కొంత కాలం వేచి చూస్తే బాగుంటుందని, దేశవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న బీజేపీ ఇక్కడ తన వైఖరిని మార్చుకొనే అవకాశం లేకపోలేదని అన్నారు. కానీ దానికి చంద్రబాబు అంగీకరించలేదు. అత్యధికులు బయటకు రావడానికే మొగ్గు చూపడంతో ఆ దిశగానే నిర్ణయం తీసుకున్నారు. ‘‘మనం పోయిన ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీయే కూటమిలో చేరాం. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని బీజేపీ సరిదిద్దుతుందని ఆశించాం. కానీ, దానికి విరుద్ధంగా జరుగుతోంది. గట్టిగా అడిగితే కుట్రలకు దిగుతున్నారు. ప్రధాని ఫోన్‌ చేసినప్పుడు న్యాయం కోసం ఎదురు చూస్తామని… కూటమిలోనే ఉన్నానని చెప్పాను. అయినా ఫలితం కనిపించడం లేదు. ప్రజలు ఏం కోరుకొంటున్నారో అదే చేద్దాం. బయటకు వచ్చేద్దాం’’ అని చంద్రబాబు అన్నట్టు తెలిసింది. దీంతో ఎన్డీయే కూటమితో టీడీపీ బంధానికి చెల్లుచీటీ రాసినట్ల అయింది. నిర్ణయం తీసేసుకున్న చంద్రబాబు దానిని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories