టీడీపీ సరికొత్త వ్యూహం

Submitted by arun on Mon, 04/09/2018 - 17:14
babu

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు. రేపు మధ్యాహ్నం టీడీపీ అధికార ప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. 2,3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీల బస్సు యాత్ర కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

హోదాపోరులో భాగంగా మేధావులు, వివిధ సంఘాలతో సమావేశం కావాలని.. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల వారీగా సైకిల్ యాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

అవినీతి, హత్యా రాజకీయాలకు పాల్పడిన వాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని.. వాళ్లు కేంద్రంతో కుమ్మక్కై.. టీడీపీపై కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు బాబు. 

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగులకు.. నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 11న జ్యోతిరావు పూలే జయంతి, 14న అంబేద్కర్ జయంతి, 20న దళిత తేజం కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

English Title
tdp new plan

MORE FROM AUTHOR

RELATED ARTICLES