చంద్ర‌బాబు సై అంటే..

Submitted by arun on Thu, 02/01/2018 - 16:45
JC

చంద్రబాబు సై అంటే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపించిన జేసీ పొమ్మనలేక పొగ పెడుతున్నట్టు ఉందని అన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని,  అతి తక్కువ నిధులిచ్చి సాయం చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నామ మాత్రంగా సాయం చేసిందని, వేల లక్షల కోట్లు సాయం చేస్తేనే నిజంగా సాయం చేసినట్లు అని వ్యాఖ్యానించారు.

పొమ్మన లేక పొగ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ మాత్రమే కాదని దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహ  ఉన్నాయని చెప్పారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామన్నామంటే ఎలా అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు.  

English Title
TDP MP JC Diwakar Reddy fire on central government

MORE FROM AUTHOR

RELATED ARTICLES