కృష్ణాజిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

కృష్ణాజిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..
x
Highlights

కృష్ణాజిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగాయలంక మండలం కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో.. 6 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో...

కృష్ణాజిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగాయలంక మండలం కమ్మనమొలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో.. 6 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకొని లంకె గోపాలస్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. సకాలంలో అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి రాకపోవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక దళం సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొవ్వ నుంచి రావడంతో మరింత ఆలస్యం అయ్యింది. దీంతో బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories