పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే అనిత

Submitted by lakshman on Sun, 12/17/2017 - 15:46

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పాలన పై పవన్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పై స్పందించిన అనిత..ప్రజాస్వామ్యంలో అందరు ఒక్కటే...పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎప్పుడైనా విమర్శించొచ్చు అని అన్నారు. అంతేకాదు ప్రజా సమస్యల్ని పవన్ ఎత్తి చూపుతుంటే సీఎం ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని పునరుద్ఘాటించారు. గతంలో ఉద్దానం కిడ్నీ సమస్య పై పవన్ స్పందింస్తే..చంద్రబాబు ఆ సమస్యని పరిష్కరించారన్నారు. 

ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రజాసమస్యల్ని మరిచి పోయి...ఎంత సేపు సీఎం కుర్చికోసమే ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో వైసీపీ కనుమరుగవుతుందని సూచించారు. ఎన్ని ఉన్నా అంతిమ నిర్ణేతలు ప్రజలేనని, ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందో 2019 ఎన్నికలే నిర్ణయిస్తాయని ఆమె అన్నారు

English Title
tdp mla anitha comments on pawankalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES