లిఫ్ట్‌లో ఇరుక్కున్న టీడీపీ నేతలు.. పావుగంట ఉత్కంఠ

Submitted by arun on Sat, 06/23/2018 - 10:58

విజయవాడ సివిల్ సప్లయి కార్యాలయంలోని  లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కున్నారు.  రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి  ప్రమాణ స్వీకారోత్సవానికి  శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఇతర నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా లిఫ్టులో వెళుతుండగా ఒక్కసారిగా మధ్యలోనే ఆగిపోయింది. పైకి తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో  రాడ్లతో లిఫ్ట్ తలుపులు బద్ధలు కొట్టి 15 నిమిషాల అనంతరం బయటకు తీశారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 

English Title
tdp leaders stuck lift vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES