చివరి నిమిషంలో మనస్సు మార్చుకున్న టీడీపీ

చివరి నిమిషంలో మనస్సు మార్చుకున్న టీడీపీ
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలనుకున్న టీడీపీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. 24 సీట్లలో పోటీ చేయాలని భావించిన టీడీపీ మహాకూటమి...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలనుకున్న టీడీపీ చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. 24 సీట్లలో పోటీ చేయాలని భావించిన టీడీపీ మహాకూటమి సీట్ల సర్ధుబాటులో 14 సీట్లలో పోటీకి సిద్ధమయ్యింది. అయితే, నామినేషన్ల పర్వం ముగిసే వరకు 13 మంది అభ్యర్ధులకు మాత్రమే బీ ఫారాలు అందచేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ ఎంతో హడావుడి చేసేది ఎన్నికల్లో ఏదైనా కూటమి ఏర్పడితే టీడీపీనే లీడ్ చేసేది అంతేకాదు ఇతర పార్టీలకు సీట్లు కేటాయించడంలోనూ ఎంతో కీలకంగా వ్యవహరించేది. కానీ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి రివర్స్ అయ్యింది. పోటీ చేయాలనుకున్న సీట్లను సాధించుకోలేకపోయింది.

మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు జత కట్టాయి. సీట్ల సర్ధుబాటుకు ముందు ఎక్కువ సీట్లు కోరిన టీడీపీ ఆ తర్వాత 14 సీట్లకు పరిమితం అయ్యింది నాలుగు విడతలుగా అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది అయినా కూటమిలో టీడీపీకి కేటాయించిన 14 సీట్లలో కేవలం 13 మందికి మాత్రమే బీ ఫారాలు అంద చేసింది. పార్టీ టిక్కెట్టు వస్తుందని ఆశించిన నేతలు అధిష్టానంపై మండిపడుతున్నారు.

పొత్తుల్లో భాగంగా పటాన్‌చెరు స్థానం టీడీపీకి లభించింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు నందీశ్వర్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్ ప్రయత్నాలను చేశారు. అయినప్పటికీ టీటీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. ఎల్బీ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన సామ రంగారెడ్డికి చివరిరోజున ఇబ్రహీపట్నం అభ్యర్ధిగా బీ.ఫాం అందచేశారు.

కూటమితో చివరి వరకు పోటీ చేసే స్థానాలపై చర్చలు జరిపి దక్కించుకున్న 14 స్థానాల్లోనూ బీ.ఫారాలు అందచేయకపోవడం పట్ల పార్టీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువ ఉందని సీట్లు వదులుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ శ్రేణులు . మొత్తం మీద టీడీపీ భీ పాం అందుకున్న13 మంది విజయానికి మహాకూటమి నేతలు ఎంత వరకు సహాకరిస్తారో అన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories