70 ఏళ్ల సమస్య... 48 గంటల్లో తేలిపోతుందా? పవన్‌కు టీడీపీ కౌంటర్‌

70 ఏళ్ల సమస్య... 48 గంటల్లో తేలిపోతుందా? పవన్‌కు టీడీపీ కౌంటర్‌
x
Highlights

సమస్యల అధ్యయనం కోసం ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్ర చేపట్టిన జనసేనాని ఉద్దానం కిడ్నీ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో...

సమస్యల అధ్యయనం కోసం ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్ర చేపట్టిన జనసేనాని ఉద్దానం కిడ్నీ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. పుష్కరాలకు 2వేలకోట్లు, విదేశీ టూర్లకు వందల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు ఉద్దానం కిడ్నీ బాధితులకు మాత్రం ఎందుకు నిధులు కేటాయించరంటూ పవన్‌ ప్రశ్నించారు. అయితే ఉద్దానం సమస్య పరిష్కారానికి 48గంటల్లో చర్యలు తీసుకోకపోతే నిరాహారదీక్షకు దిగుతానంటూ అల్టిమేటం ఇచ్చిన జనసేనానికి టీడీపీ ధీటుగా కౌంటరిస్తోంది.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి 48గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే తాను నిరాహారదీక్షకు దిగుతానంటూ అల్టిమేటం ఇచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్‌కు తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. 70ఏళ్ల సమస్య గంటల వ్యవధిలో ఎలా పరిష్కారమైపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై మొదటి స్పందించింది టీడీపీ ప్రభుత్వమేనన్న బోండా ఉమా బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పవన్ దీక్ష చేస్తే చేసుకోవచ్చుగానీ సమస్య గంటల్లో పరిష్కారం కాదన్నారు.

ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూసి తన కడుపు రగిలిపోతుందన్నారు. అమెరికా నుంచి తాను నిపుణులను తీసుకొచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. పుష్కరాలకు 2వేలకోట్లు, విదేశీ టూర్లకు వందల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు.... ఉద్దానం కిడ్నీ బాధితులకు మాత్రం ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నిస్తున్నారు.

ఉద్దానం సమస్యపై పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. తప్పుడు సమాచారంతో పవన్‌ను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కిడ్నీ సమస్య ఉన్న పలాస, వజ్రపుకొత్తూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, మందసలో సుమారు 16కోట్ల రూపాయలతో సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 109 రిమోట్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేశామన్న లోకేష్‌ ఈ నెలాఖరులోగా మరో 27 యూనిట్స్‌ పూర్తి కాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు లక్షమందికి స్క్రీనింగ్‌ చేశామన్న లోకేష్‌ కిడ్నీ బాధితులకు డయాలిసిస్‌తోపాటు నెలకు 2500 పెన్షన్స్‌ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే సోంపేటలో కొత్త ల్యాబ్‌, అదేవిధంగా పలాస, సోంపేట, పాలకొండలో డయాలసిస్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ట్వీట్‌లో వివరించారు.

సమస్యల అధ్యయనం కోసం ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్ర చేపట్టిన జనసేనాని... ఉద్దానం కిడ్నీ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. కనీసం సమస్యను వివరిద్దామంటే వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా లేరంటూ చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. అయితే 48గంటల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ డెడ్‌లైన్‌ పెట్టడంతో తెలుగుదేశం నేతలు కూడా ఘాటుగానే రియాక్టవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories