కేంద్రాన్ని మేనేజ్ చేయడం వల్లే..

కేంద్రాన్ని మేనేజ్ చేయడం వల్లే..
x
Highlights

పీకల్లోతో కేసుల్లో మునిగిపోయిన జగన్ కేంద్రాన్ని మేనేజ్‌ చేయడం వల్లే కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, టీడీపీ నేత వర్ల రామయ్య...

పీకల్లోతో కేసుల్లో మునిగిపోయిన జగన్ కేంద్రాన్ని మేనేజ్‌ చేయడం వల్లే కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తుంటే ప్రతిపక్ష నేత అన్న బాధ్యత మరచి కేంద్రాన్ని విమర్శించకుండా సీఎం చంద్రబాబును విమర్శించడంలో అర్ధమేంటని అయన ప్రశ్నించారు. కేసుల విచారణ ముగిస్తే జగన్‌కు జైలుశిక్ష ఖాయమని వర్ల చెప్పారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్న ప్రధాని మోదీ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని మోదీ చేతిలో జగన్‌ రిమోట్‌లా మారారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ విమర్శించారు. ఇద్దరు నేతలూ ఆదివారం గుంటూరు జిల్లాలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. హోంశాఖ, బీజేపీని మేనేజ్‌ చేయడం వల్లే.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి రావడం మినహా మరేం జరగడం లేదని కారెం శివాజీ విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జగన్ కేసు తేల్చాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories