సీఎం రమేష్ గ్రామానికి ఎక్కువ.. మండలానికి తక్కువ : టీడీపీ నేత ఫైర్

Submitted by nanireddy on Tue, 07/31/2018 - 10:28
tdp-leader-nandyala-varada-rajulu-reddy-fire-cm-ramesh-ysr-kadapa

రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై  టీడీపీ నేత నంద్యాల వరదరాజులరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్‌ అయ్యారు.  ఎంపీ రమేష్‌ గ్రూపులను కూడగట్టి వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు.  సీఎం రమేష్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే స్థానిక వైసీపీ నాయకులకు ఫోన్లు చేసిన విషయం బయటపడుతుందన్న వరదరాజులురెడ్డి అయన వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. దమ్ము, ధైర్యముంటే కడప, పులివెందుల నియోజకవర్గాల్లో రాజకీయాలు చేయాలని సవాల్‌ విసిరారు. సీఎం రమేష్‌ గ్రామ రాజకీయాలకు ఎక్కువ, మండల రాజకీయాలకు తక్కువ అని ఎద్దేవా చేశారు. పైగా ప్రతిసారి నామినేటెడ్ పదవికోసం పాకులాడే రమేష్  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన సత్తాను చాటుకోవాలన్నారు. కాగా రమేష్ వ్యవహారంపై అవసరమైతే  అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. 

English Title
tdp-leader-nandyala-varada-rajulu-reddy-fire-cm-ramesh-ysr-kadapa

MORE FROM AUTHOR

RELATED ARTICLES