ఎన్టీఆర్‌ చావుకు బాబే కారణం.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 05/28/2018 - 12:26
Motkupalli

సీఎం చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగతనం చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. చివరకు కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. 

రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపావు అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. దగ్గుబాటి కుటుంబాన్ని, నందమూరి హరికృష్ణను చంద్రబాబు వాడుకొని వదిలేశారని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబే కారణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే కుట్రను చంద్రబాబు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెద్ద నటచక్రవర్తి. మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని విమర్శించారు.
 

English Title
TDP Leader Motkupalli Narasimhulu Fire on CM Chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES