నేడు వైసీపీలోకి టీడీపీ కీలక నేత!

Submitted by nanireddy on Sat, 05/05/2018 - 11:23
tdp leader kannababu joied in ycp

శనివారం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు విశాఖ జిల్లా యలమంచిలి మాజీ శాసనసభ్యులు రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు) గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికైన కన్నబాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. కానీ అప్పటికే పార్టీలో కొనసాగుతున్న పంచకర్ల రమేష్ బాబుకు టికెట్ కేటాయించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఈ క్రమంలో కన్నబాబుకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. కానీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయనకు ఎమ్మెల్సీ  ఇవ్వలేదు పైగా తన క్యాడర్ ను టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యం చేస్తుందన్న కారణాలతో కన్నబాబు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 10 రోజుల క్రితం జగన్ ను కలిసిన ఆయన ఈ నెల 5 వ తేదీన వైసీపీలో చేరతానని ప్రకటించారు. 

English Title
tdp leader kannababu joied in ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES