కొత్త కాపురంలో చిచ్చురేపిన పచ్చబొట్టు!

Submitted by arun on Fri, 07/20/2018 - 16:20
Tattoo

ఎంతో ముచ్చటపడి ఓ వ్యక్తి వేయించుకున్న పచ్చబొట్టు.. వాళ్ల కాపురంలో చిచ్చు రేపింది. కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా భార్య.. నడిరోడ్డు పై భర్త దుమ్ముదులిపి వదిలిపెట్టింది. అందుకు కారణం ఏంటో తెలుసా..? భర్త చేతిపై పచ్చబొట్టే. తన భర్త చేతిపై మరో యువతి పేరుండటంతో సహించలేకపోయిన నవ వధువు దుమ్ము రేపేసింది. పెళ్లయిన ఐదోరోజే.. అది కూడా ఆలయమని కూడా చూడకుండా భర్తను చెడుగుడు ఆడేసింది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ఆలయంలో బాబా దర్శనం తర్వాత ఆ జంట ఆలయమెట్లపై కూర్చుని కబుర్లాడుకున్నారు. ఆ సమయంలో భర్త చేతిపై ఓ అమ్మాయి పేరుతో పచ్చబొట్టు ఉండటాన్ని గమనించిన భార్య ఆ యువతి ఎవరని ప్రశ్నించింది. సమాధానం రాకపోవడంతో భర్త జుట్టుపట్టుకుని చెంప ఛెళ్లుమనిపించింది. కాళ్లతో తన్నుతూ, వీపుపై పిడిగుద్దులు కురిపించింది.
 

English Title
Tattoo lands man in trouble

MORE FROM AUTHOR

RELATED ARTICLES