వైజాగ్‌ పార్లమెంట్ నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా భరత్‌?

వైజాగ్‌ పార్లమెంట్ నియోకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా భరత్‌?
x
Highlights

ఆయనొక లెజెండ్. ఆయన ఫ్యామిలీది పొలిటికల్ ట్రెండ్. ఆ‍యన పెద్దల్లుడు రాబోయే కాలంలో, కాబోయే సీఎం అని పొలిటికల్‌ టాక్. ఇప్పుడు చిన్నల్లుడు సైతం రాజకీయ...

ఆయనొక లెజెండ్. ఆయన ఫ్యామిలీది పొలిటికల్ ట్రెండ్. ఆ‍యన పెద్దల్లుడు రాబోయే కాలంలో, కాబోయే సీఎం అని పొలిటికల్‌ టాక్. ఇప్పుడు చిన్నల్లుడు సైతం రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. సాగరతీరంలో సమరానికి సై అంటున్నాడు. ఇంతకీ ఎవరా బుల్లోడు?

అవును నందమూరి బాలకృష్ణ కుటుంబంలో మరో అల్లుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అతనే భరత్. భరత్‌. గీతం విద్యా సంస్థల అధినేత, ఎంపీగా పని చేసిన, దివంగత మూర్తి మనవడు. బాలకృష్ణ చిన్నల్లుడు. లోకేష్‌ తోడల్లుడు. వైజాగ్‌ పార్లమెంట్ నియోకవర్గం నుంచి, టీడీపీ తరపున భరత్‌ బరిలోకి దిగడం ఖాయమని, రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటును భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది తెలుగుదేశం. ఈసారి బీజేపీతో పొత్తు లేదు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి భరత్ రంగంలోకి దిగనున్నారని ప్రచారం సాగుతోంది.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు భరత్. తాను బిజినెస్ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా, రాజకీయాలపై అవగాహన ఉందన్నారు. వైజాగ్ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమన్న భరత్, మరింతగా అభివృద్ది కావాల్సి ఉందన్నారు. అందుకు తాను పాటుపడతానన్నారు. రాజకీయాల్లో ఎవరు పోటీలోఉంటారు అనేది ముఖ్యం కాదని, కష్టపడి పని చేయడమే ప్రధానం అంటున్నారు.

వైజాగ్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నుంచే, భరత్‌ను రంగంలోకి దింపడం వెనక, తెలుగుదేశం అధినేతకు చాలా సమీకరణలున్నాయి. గీతం విద్యాసంస్థల అధినేత మూర్తి అంటే, విశాఖలో తెలియనివారు లేరు. ఆయన కుటుంబానికి మంచి పేరుంది. మూర్తి కూడా ఎంపీగా చేశారు. దీనికి తోడు బాలయ్య చిన్నల్లుడిగా కూడా భరత్‌కు‌, నందమూరి ఫ్యాన్స్‌లో అభిమానముంది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ఎదగడం, యువకుడు, విద్యాధికుడు కావడం భరత్‌కు ప్లస్‌ పాయింట్లుగా టీడీపీ నేతలంటున్నారు. వైజాగ్ పార్లమెంట్ పరిధిలోని ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ నేతలు గెలిచారు. మరోవైపు ఇదే జిల్లాలో బీమిలి ఎమ్మెల్యేగా చంద్రబాబు తనయుడు, లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా అనేక సమీకరణాలు సానుకూలాంశాలుగా భావిస్తున్న చంద్రబాబు, వైజాగ్‌ నుంచి భరత్‌ను రంగంలోకి దింపితే, గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అందుకే టికెట్ ఖాయం చేశారని తెలుస్తోంది.

ప్రతిపక్షం వైసీపీ నుంచి భరత్‌కు పోటీ ఎవరనేది ఆసక్తి కలిగిస్తోంది. 2014లో వైజాగ్ నుంచి విజయమ్మ పోటీ చేశారు. ఇప్పుడు ఎంవివి చౌదరి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రెండు బలమైన కుటుంబాల నేపథ్యంతో భరత్‌ బరిలోకి దిగడం, వైసీపీ కూడా బలమైన అభ్యర్థినే రంగంలోకి దించుతుండటంతో, వైజాగ్ పోరు ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories