ఆడవాళ్లకి ఆడవాళ్లతోనే పెళ్లి..!

Highlights

పెళ్లికాని ప్రసాదులూ.. పారాహుషార్‌! పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసేసుకోండి! భవిష్యత్తులో పెళ్లికాకపోవచ్చు! అమ్మాయిలు దొరకరు! మరో నాలుగైదేళ్లలో పెళ్లికి...

పెళ్లికాని ప్రసాదులూ.. పారాహుషార్‌! పెళ్లి చేసుకుంటే ఇప్పుడే చేసేసుకోండి! భవిష్యత్తులో పెళ్లికాకపోవచ్చు! అమ్మాయిలు దొరకరు! మరో నాలుగైదేళ్లలో పెళ్లికి ‘అమ్మాయిల కొరత’ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. ఆపైన పదేళ్ల వరకు ఆ కొరత తీవ్రంగా ఉండబోతోంది. ప్రస్తుతానికి ఆ ముప్పు ఏం లేకున్నా.. భవిష్యత్తులో మాత్రం పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు ఇబ్బందులు తప్పవు అమ్మాయిలు అనే మాటలు వింటున్నాం. కానీ వారికి మాత్రం అలాకాదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆడవాళ్లకి ఆడవాళ్లనిచ్చి పెళ్లి చేస్తారు.
'న్యుంబా టొబు(ఆడవాళ్ల ఇల్లు)'
పుట్టెడు కష్టాలతో ...పురాషాధిక్యంతో పడుతున్న కష్టాలపై 'న్యుంబా టొబు(ఆడవాళ్ల ఇల్లు)'ను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆడవాళ్లని ఆడవాళ్లకిచ్చి పెళ్లిళ్లు చేస్తారు.
టాంజానియాలోని మరా అనే ప్రాంతంలో ఆరేడు ఆవుల్ని ఇస్తే వయసురాని పిల్లల్ని కూడా కన్యాదానం చేసే తండ్రులున్నారు...గొడ్ల పాకలో ఆవుల మంద పెరగగానే భార్యల సంఖ్యను పెంచే ప్రబుద్ధులూ ఉన్నారు...కొడుకులు లేని తల్లి భర్త ఆస్తికి వారసురాలు కాదు అని చెప్పే కట్టుబాట్లూ ఉన్నాయి... మరి, అబల బతికేదెలా... దానికి సమాధానంగా పుట్టుకొచ్చిన సంప్రదాయమే మహిళ మరో మహిళను పెళ్లిచేసుకోవడం.మామూలుగా పెళ్లి అనగానే ఎవరైనా అమ్మాయి పేరేంటీ అబ్బాయిది ఏ వూరు... లాంటి వివరాలు అడుగుతారు. మరా ప్రాంతంలో పెళ్లి మాట ఎత్తగానే అమ్మాయికీ అబ్బాయికీ జరిగేదా లేదంటే ఇద్దరు స్త్రీలకు మధ్య జరిగేదా... అని అడుగుతారు. ఎందుకంటే 'న్యుంబా టొబు(ఆడవాళ్ల ఇల్లు)' పేరుతో అక్కడ వితంతువైన మహిళ మరో యువతిని పెళ్లి చేసుకోవడం పూర్వం నుంచీ ఉన్న ఆచారం.

టాంజానియాలో కుర్యా తెగ

టాంజానియాలో కుర్యా అనే తెగకు చెందిన ఏడు లక్షమంది జనాభా ఉన్నారు. వారిలో ఎక్కువమంది పురుషులు కావడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో చేసేది ఏమీ లేక అక్కడ అమ్మాయిల్ని అమ్మాయిలకిచ్చి పెళ్లిళ్లు జరుపుతున్నారు. ఆ తెగలో ముందుగా పెళ్లి జరగాలంటే వేలం పాట జరగాలి. వేలం పాటలో ఎవరు ఎక్కువ ఆవుల్ని ఇస్తే వారికి తమ కూతుళ్లని ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారు. అదే ఆవులు లేకపోతే పెళ్లిళ్లు జరగవు. ఆవులు ఉంటే రేపో మాపో కాటికి కాళ్లు చాపేవాడికిచ్చి కట్టబెట్టేస్తుంటారు. అంతలా మరుగునపడింది వాళ్ల సాంప్రదాయం.
జుమా - మరా ప్రాంతంలోని న్యామొంగొ గ్రామంలో ఉండే జుమా(13)కి పెళ్లి కావాల్సి ఉంది. అయితే ఓ యాబైఏళ్ల వ్యక్తికిచ్చి ఆమె పెళ్లి చేశారు. గొడ్డు చాకిరి, బానిస బతుకు. ఏం చేయాలో దిక్కుతోచక పుట్టిన బిడ్డను తీసుకొని రోడ్డున పడింది. ఆపదలో ఉన్నాను కాపాడండి అంటూ ప్రాదేయపడింది. ఎక్కడ ఉండాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాంటూ ఓ ఇద్దరు మృగాళ్లు ఆమెను తల్లిని చేశారు. ఆ తర్వాత తాను మగాళ్లను నమ్మాలనుకోలేదు. కానీ పిల్లల ఆలనా పాలన చూసుకోవాలి. ఇందుకు పెళ్లి చేసుకోవడమే మార్గమనకుంది. అందుకే ఆమె తాను పెళ్లి చేసుకోవడానికి తనకో భార్యను చూడమని 'న్యుంబా టొబు(ఆడవాళ్ల ఇల్లు)' వాళ్లకి చెప్పింది.

ముగోసీ - అంతే భర్త వదిలేసి పుట్టెడు కష్టాల్లో ఉన్న 'ముగోసీ'ని చూపించారు జుమాకి. ఇద్దరు కష్టాల్లో ఉన్నారు. ఆ ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అలా వాళ్లిద్దరు సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు.
న్యుంబాటొబు పద్ధతి ప్రకారం - పెళ్లై పిల్లలున్న అమ్మాయిల్నే కాదు, పెళ్లికాని యువతుల్ని కూడా వితంతువులు వివాహం చేసుకోవచ్చు. అయితే, ఆ యువతి నచ్చిన అబ్బాయితో సహజీవనం చేసి, తన వితంతు భార్యకు పిల్లల్ని కనివ్వాలి. ఒకవేళ ఆ అబ్బాయి వితంతు మహిళ కుటుంబంతోనే ఉండాలనుకున్నా ఉండొచ్చు. అదే 'న్యుంబా టొబు పెళ్లి చేసుకుంటే గృహ హింస ఉండదు, మనసుకు నచ్చిన వ్యక్తితోనే పిల్లల్ని కనొచ్చు' అని యువతులు ఆవైపు మొగ్గు చూపుతున్నారట. అందుకే, టాంజానియా మొత్తం జనాభాలో ఇలా ఆడవాళ్లు ఆడవాళ్లనే పెళ్లి చేసుకుని ఉంటున్న కుటుంబాలు పది నుంచి పదిహేను శాతం వరకూ ఉన్నాయట.

Show Full Article
Print Article
Next Story
More Stories