చైనీస్‌ చికెన్‌ నూడుల్స్‌ తయారీ ఎలా?

చైనీస్‌ చికెన్‌ నూడుల్స్‌ తయారీ ఎలా?
x
Highlights

కావలసిన పదార్ధాలు బోన్‌లెస్‌ చికెన్‌: ముప్పావు కిలో కార్న్‌ఫ్లోర్‌: ఒకటిన్నర టేబుల్‌స్పూను నూనె: 4 టేబుల్‌స్పూన్లునూడుల్స్‌: పావుకిలో ...

కావలసిన పదార్ధాలు

బోన్‌లెస్‌ చికెన్‌: ముప్పావు కిలో

కార్న్‌ఫ్లోర్‌: ఒకటిన్నర టేబుల్‌స్పూను

నూనె: 4 టేబుల్‌స్పూన్లునూడుల్స్‌: పావుకిలో

వెల్లుల్లితురుము: టేబుల్‌స్పూను

ఎండుమిర్చి: మూడు

కాలీఫ్లవర్‌ రెమ్మలు: కప్పు

క్యాప్సికమ్‌ ముక్కలు: అరకప్పు

జీడిపప్పు: అరకప్పు

వినెగర్‌ : 2 టేబుల్‌స్పూన్లు

సోయాసాస్‌: టేబుల్‌స్పూను

చిల్లీసాస్‌: 3 టేబుల్‌స్పూన్లు

ఉప్పు

తయారీ విధానం :

ముందుగా జీడిపప్పుని వేయించి ఉంచాలి. నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి. అందులో నూడుల్స్‌ వేసి ఉడికించాలి. తరవాత నీళ్లు వంపేసి చల్లని నీళ్లతో కడిగి నూడుల్స్‌ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కల్ని బాగా కడిగిన తరువాత కాసేపు ఆరనిచ్చాక వాటిమీద ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడయిలో నూనె పోసి కాగాక కొంచెంకొంచెంగా చికెన్‌ ముక్కలు వేసి వేయించి తీయాలి. తరవాత మిగిలిన నూనె వంపేసి మూడు టేబుల్‌స్పూన్లు మాత్రం ఉంచాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి తురుము, ఎండుమిర్చి వేసి వేగాక కాలీఫ్లవర్‌ రెమ్మలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు వేసి, మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు సాస్‌కోసం తీసుకున్న సోయాసాస్, వెనిగర్, చిల్లీసాస్‌ లు అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్‌ కూడా వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన జీడిపప్పు వేసి, ఇష్టమైతే కాస్త ఉల్లికాడల తురుము, నువ్వులు చల్లి దించాలి. చైనీస్ చికెన్ నూడుల్స్ రెడీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories