పెళ్లి చూపులకొచ్చి బిడ్డ తల్లితో యువకుడు పరార్

Submitted by arun on Fri, 06/01/2018 - 12:36
marriage

పెళ్లి సంబంధం కోసం పెళ్లి చూపులకు వచ్చిన ఓ యువకుడు పెళ్లైన ఆమె అక్కతో ఉడాయించిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్‌లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది. పెద్దకుమార్తె అన్నాదురైతో లేచిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి  మైలాపూరు పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశాడు. తన చిన్నకుమార్తె పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కుమార్తె లేచిపోయిందని, వెళ్తూ వెళ్తూ ఇంటిలోని ఐదు సవర్ల నగలు, రూ.2లక్షలు నగదును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. ప్రేమజంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

English Title
tamil nadu man escape with married woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES