కేరళ బాధితులకు విజయ్ భారీ విరాళం

Submitted by arun on Sat, 08/18/2018 - 12:01
vijay

జలవిలయంలో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు ముందుకొచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థికసాయం ప్రకటించి తమకు తోచినంత విరాళం ఇచ్చారు. జల దిగ్బంధం నుంచి కేరళ వాసులు త్వరగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. తాజా సమాచారం ప్రకారం తమిళ హీరో విజయ్ కేరళకు రూ.14 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందించినట్టుగా తెలుస్తుంది.  మరో సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ కేరళ బాధితుల కోసం రూ.10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.  

తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కేరళ సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించగా విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ఇచ్చారు. కేరళ ప్రజలు తనపై చూపిన ప్రేమానురాగాలు ఎనలేనివని పేర్కొన్న అల్లు అర్జున్ వారికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నాడు. తనవంతు సాయంగా రూ.25 లక్షలు ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. రూ.5 లక్షల విరాళం ప్రకటించిన విజయ్.. కేరళ వాసులను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ యువతకు పిలుపునిచ్చాడు. నిర్మాత బన్నీ వాసు ‘గీత గోవిందం’ సినిమా కేరళ వసూళ్లను సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు.  

English Title
tamil actor vijay donate to Kerala fund

MORE FROM AUTHOR

RELATED ARTICLES