పచ్చళ్లు రోజూ తింటే బీపీ పెరుగుతుందా?

పచ్చళ్లు రోజూ తింటే బీపీ పెరుగుతుందా?
x
Highlights

ఎన్ని కూరలున్నా ఘుమఘుమలాడే ఆవకాయ లేనిదే భోజనం చేసిన తృప్తి మిగలదు తన తెలుగువారికి. మామిడికాయ మొదలుకుని కూరగాయలతో పట్టే ఏ ఆవకాయకైనా సరైన సీజన్...

ఎన్ని కూరలున్నా ఘుమఘుమలాడే ఆవకాయ లేనిదే భోజనం చేసిన తృప్తి మిగలదు తన తెలుగువారికి. మామిడికాయ మొదలుకుని కూరగాయలతో పట్టే ఏ ఆవకాయకైనా సరైన సీజన్ వేసవే..అందుకే సమ్మర్‌లోనే సంవత్సరానికి సరిపడినంత పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటుంటారు. వీటిని సంవత్సరం మొత్తం ఎంతో ఇష్టంగా తింటారు..అయితే ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ...ఈ నిల్వ పచ్చళ్లు రోజూ తినొచ్చా...తింటే మంచిదేనా...అన్న డౌట్ ఈ మధ్యకాలంలో మొదలైంది..ఓ వైపు నోరురిస్తున్న ఊరగాయ ఉంటే ఎవరు ఆగుతారు...మూడు పూటలా పచ్చళ్లతోనే భోజనం కానిచ్చేస్తారు..

ఏదైనా మితంగా ఉంటేనే అందరికీ మంచిది..రుచిగా ఉంది కదా అని రోజు పచ్చళ్లు తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవ్వక తప్పదు. పచ్చళ్లలో ఉప్పు, నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అరగడానికి సమయం పట్టడమే కాకుండా, బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో వాడేవన్ని ఆరోగ్యపరంగా మంచివే అయినా సరే.. వాటిని నిల్వ చేసి తింటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ పచ్చళ్లను ఎక్కుగా తీసుకోకూడదు. రోజుకి ఒక టీ స్పూన్ పచ్చడి మాత్రమే తినాలని వైద్య నిపుణుల సూచన. అయితే నిల్వ పచ్చడితో పోలిస్తే రోటి పచ్చళ్లు కొంతవరకు మేలే. వీటిని తినొచ్చు. అలా అని పచ్చళ్లు మొత్తానికే మానేయాల్సిన అవసరం లేదు.. ముందుగా చెప్పినట్లు మితంగా తింటే చాలని చెబుతున్నారు నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories