సీనియర్ తో.. రొమాన్స్ చేస్తోంది!

Submitted by arun on Thu, 03/29/2018 - 11:38
Tamannaah to romance Venkatesh

హీరోయిన్లకు విక్టరీ వెంకటేష్ లక్కీ హాండ్. అందులో ఎలాంటి సందేహం లేదు. వెంకీతో మొదటిసారి నటిస్తున్నారంటే.. కచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. డెబ్యూ హీరోయిన్లకైతే.. ఈ సెంటిమెంట్ గతంలో ఎంతగా వర్కవుట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అంజలా ఝవేరీ, ప్రీతీజింతా, ఆర్తి అగర్వాల్, కత్రినా కైఫ్.. ఇలా.. టాలీవుడ్ కు కొత్త అందాలను తీసుకురావడంలో.. వెంకీ స్టైలే సెపరేటు.

కానీ.. ఓ హీరోయిన్ మాత్రం టాప్ రేంజ్ కు ఎదిగినా కూడా.. పదేళ్లుగా వెంకీతో కలిసి నటించలేదు. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న ఆ హీరోయిన్.. వెంకటేష్ తో కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తోంది కూడా. ఇన్నాళ్లకు ఆమె కల ఫలించింది. వరుణ్ తేజ్ తో కలిసి చేస్తున్న వెంకటేష్ మల్టీ స్టారర్ లో.. మిల్కీ బ్యూటీ తమన్నా చాన్స్ కొట్టేసింది. సీనియర్ హీరోయిన్ కాబట్టి.. వెంకటేష్ కే ఆమె హీరోయిన్ అని కన్ఫమ్ అవుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మెహరీన్ ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఎఫ్ 2.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నారు.

English Title
Tamannaah to romance Venkatesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES