త్వరలో తమన్నా పెళ్లి...వరుడెవరంటే..

Submitted by arun on Tue, 07/24/2018 - 16:49
tamanna

మూడుపదుల వయసు దాటిన హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్నారు. డబ్బుతో పాటు దాంపత్య జీవితమూ ముఖ్యమేనంటున్నారు.  మొన్ననే శ్రియ పెళ్లి చేసుకోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా పెళ్లి పీటలెక్కనుంది. తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని అంటున్నారు. అతడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థరపడిన కుటుంబమని సమాచారం! అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం. పెళ్ళి తరువాత తమన్నా అమెరికా వెళ్ళిపోతుందని అంటున్నారు. పెళ్లి కోసమే తమన్నా పెద్దగా సినిమాలు ఒప్పుకోవడంలేదని టాక్!


 

Tags
English Title
tamanna marriage soon

MORE FROM AUTHOR

RELATED ARTICLES