రాజేశ్వరరెడ్డిని హత్తుకుని కన్నీరు పెట్టుకున్న రాజయ్య

Submitted by arun on Wed, 09/19/2018 - 16:12

స్టేషన్ ఘన్‌పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. తనను గెలిపించాలంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చేస్తున్న ప్రచారంలో  పాల్గొన్న ఆయన ఒక్క సారిగా కన్నీరు పెట్టుకున్నారు. తనను గెలిపించేందుకు చేస్తున్న కృషిని తలుచుకుంటూ పాదాభివందనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే ఆప్యాయంగా హత్తుకున్న  పల్లా రాజేశ్వర్ రెడ్డి  పార్టీ అభ్యర్ధిగా గెలిపించడం తన బాధ్యతంటూ ప్రకటించారు. దీంతో కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో ప్రచారాన్ని హోరెత్తించారు.  
 

English Title
T Rajaiah Emotional In Election Campaign

MORE FROM AUTHOR

RELATED ARTICLES