నేడే కాంగ్రెస్ తుది జాబితా విడుదల

Submitted by chandram on Sun, 11/18/2018 - 11:55

కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితా నేడు విడుదల కానుంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా 94 స్దానాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్  ఇప్పటి వరకు మూడు విడతల్లో 88 మంది అభ్యర్ధులను ప్రకటించింది. మిగిలిన 6 స్ధానాలను అభ్యర్ధులను నేడు ఖరారు చేయనుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని పటాన్‌చెరు, రాజేంద్ర నగర్‌, సికింద్రాబాద్‌ స్ధానాలతో పాటు  కోరుట్ల, నారాయణఖేడ్‌, నారాయణపేట్‌ స్ధానాల్లో ఆశావాహులు అధికంగా ఉండటంతో అభ్యర్ధులను ఖరారు చేయలేదు. గ్రేటర్ పరిధిలోని రాజేంద్ర నగర్ స్ధానాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఆశిస్తూ ఉండగా సికింద్రాబాద్ స్ధానాన్ని మర్రి శశిధర్ రెడ్డికి కేటాయించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తుది జాబితాపై ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక మహాకూటమిలో పార్టీగా వారిగా అభ్యర్ధుల విషయానికి వస్తే కాంగ్రెస్ 94 స్ధానాలకు గాను 88 మందిని ప్రకటించింది. టీడీపీ 14కు గాను 13 మందిని ప్రకటించగా .. టీజేఎస్‌ 8 స్ధానాలకు గాను నలుగురిని ప్రకటించింది.   

English Title
T- Congress To Release Final List of MLA Candidates For Telangana Assembly Election

MORE FROM AUTHOR

RELATED ARTICLES