2019 ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన టీ కాంగ్రెస్

Submitted by arun on Wed, 09/05/2018 - 15:52

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.... టీకాంగ్రెస్‌ మేనిఫెస్టో అంశాలను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను వివరించారు. ముఖ్యంగా హౌసింగ్‌ స్కీమ్‌‌కి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్న ఉత్తమ్‌ ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అదే ఎస్సీఎస్టీలకైతే 6లక్షలు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లులు క్లియర్ చేస్తామన్న ఉత్తమ్‌ ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి మరమ్మతుల కోసం 3లక్షల రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు చేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. అలాగే  18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 5లక్షల రూపాయల బీమా చేయిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వ,నున్నట్లు తెలిపారు. అలాగే బంగారు తల్లిలాంటి పాత పథకాల పునరుద్ధరణతోపాటు జనాభా ఆధారంగా సబ్‌ప్లాన్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని, ఎస్సీఎస్టీలకైతే ఉచితంగా ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

టీ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానాంశాలు 
ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇల్లు
ఇళ్లు లేని కుటుంబాలకు రూ.5 లక్షలు
కల్యాణ లక్ష్మీ సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా రూ.3 లక్షలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు

English Title
t congress manifesto released

MORE FROM AUTHOR

RELATED ARTICLES