కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతల వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:02
T Congress Leaders

ముందస్తు అసెంబ్లీ రద్దు, అభ్యర్ధుల ఎంపికతో రయ్‌మని దూసుకెళుతున్న కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌కు ధీటుగా తాము కూడా అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామన్న కాంగ్రెస్ అగ్ర నేతలు అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించారు. సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో తాజా మాజీలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్‌లు కాసేపట్లో భేటి కానున్నారు. రాష్ట్రంలో సోనియా, రాహుల్ గాంధీ పర్యటనలు, టీఆర్ఎస్‌ను క్షేత్ర స్ధాయి నుంచి ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. 11 గంటల లోపు గాంధీ భవన్ చేరుకోవాలంటూ నేతలకు సూచించింది. ముందస్తు ఎన్నికల మేనిఫేస్టోతో పాటు పీసీసీ కమిటీల ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు. 
 

English Title
T Congress Leaders Holds Meet at Jana Reddy House

MORE FROM AUTHOR

RELATED ARTICLES