స్వాతి బతికుండగానే కర్మకాండలు

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:27

వివాహేతర సంబంధాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో..? కుటుంబాల పరువును ఎలా బజారుకీడుస్తాయో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్రషర్‌ వ్యాపారి సుధాకర్‌రెడ్డి హత్య కేసును చూస్తే తెలుస్తోంది. భర్త తనని పట్టించుకోవడంలేదని ఆవేదనో..?రాజేష్ పై ఉన్న వ్యామోహమో వెరసీ పిల్లలు దర్శిత్‌ (7), హర్షిత(4) అమ్మానాన్నల ప్రేమకు దూరమయ్యేలా చేసింది. భర్తను వదిలించుకోవాలని..ప్రియుడు రాజేష్ కు దగ్గర అవ్వాలని వేసిన  పన్నాగంలో  నవంబరు 27న  కొడుకు దర్శిత్‌ (7) పుట్టిన రోజే తండ్రి సుధాకర్ రెడ్డి హత్యకు గురికావడం ప్రతీ ఒక్కరిని కలిచి వేస్తుంది. అయితే సుధాకర్ రెడ్డి హత్యపై స్వాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. భర్తపై ఇంత దారుణానికి ఒడిగట్టిన తమ కూతురు బతికున్నా.. చచ్చిన శవంతో సమానమని స్వాతి తండ్రి లింగారెడ్డి గుండు గీయించుకొని స్వాతికి కర్మకాండలు నిర్వహించారు. తమకు గర్భ శోకాన్ని మిగిల్చిన రాజేశ్‌, స్వాతిలకు ఉరిశిక్ష వేయాలని సుధాకర్‌రెడ్డి తల్లి సుమలత అన్నారు.

English Title
swati-and-rajesh-had-murdered-her-husband-sudhakar-reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES