హోప్ సెంచరీ మిస్.. బాంగ్లాదేశ్ లక్ష్యం 322

హోప్ సెంచరీ మిస్.. బాంగ్లాదేశ్ లక్ష్యం 322
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో బాంగ్లాదేశ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మాన్ హోప్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 121 బంతుల్లో 96 పరుగులు చేసిన హోప్...

వరల్డ్ కప్ టోర్నీలో బాంగ్లాదేశ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాట్స్ మాన్ హోప్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 121 బంతుల్లో 96 పరుగులు చేసిన హోప్ రెహమాన్ బౌలింగ్ లో లిటన్ దాస్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారీ స్కోరు దిశగా పరుగులు తీసిన విండీస్ ను చివర్లో బంగ్లా బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ.. ఒత్తిడి పెంచారు. 15 బంతుల్లోనే 33 పరుగులు చేసి ఊపు మీదున్న కెప్టెన్ హోల్డర్ ను సైఫుద్దీన్ అవుట్ చేశాడు. ఆ వెంటనే సెంచరీకి చేరువలో ఉన్న హోప్ ఔటయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన థామస్ జాగ్రత్తగా ఆడుతూ, బ్రేవోకు సహాయంగా నిలిచాడు. దీంతో విండీస్ 300 పరుగుల మైలురాయిని దాటింది. మొత్తమ్మీద నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.

- ఈ మ్యాచ్ లో హిట్ మేయర్ భారీ సిక్స్ కొట్టాడు. 104 మీటర్ల దూరం కొట్టిన ఈ సిక్స్ టోర్నమెంట్ కే భారీ సిక్స్ గా ఐసీసీ పేర్కొంది. అయితే కొద్దీ సేపట్లోనే విండీస్ కెప్టెన్ ఈ రికార్డును చెరిపేశాడు. 105 మీటర్ల భారీ సిక్స్ ను కొట్టి రికార్డ్ సృష్టించారు. అయితే.. ఇద్దరూ కూడా ఈ భారీ సిక్స్ లు కొట్టిన వెంటనే.. తరువాత బంతికే ఔటవ్వడం విశేషం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories