టీఆర్ఎస్, మహాకూటమిపై పరిపూర్ణానంద విమర్శలు

టీఆర్ఎస్, మహాకూటమిపై పరిపూర్ణానంద విమర్శలు
x
Highlights

టీఆర్ఎస్, మహాకూటమిలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని స్వామి పరిపూర్ణానంద ఎద్దేవచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాసమావేశం...

టీఆర్ఎస్, మహాకూటమిలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని స్వామి పరిపూర్ణానంద ఎద్దేవచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాసమావేశం నిర్వహించారు. హిందువుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీనే గెలిపించాలని పరిపూర్ణానంద అన్నారు. తెలంగాణలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీసస్ పరిపాలన తీసుకొస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అంటుంటే,, టీఆర్ఎస్ వాళ్లయితే తెలంగాణ అంటే నిజామేనని ఆయన చరిత్ర ప్రతిఒక్కరూ చదువుకోవాలని చెబుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజాం లాంటి గొప్ప నాయకుడు, తెలంగాణను నడిపించిన నేత ఎవరూ ఉండరన్నట్టుగా తెరాస నేతలు అనడం, నిజామే తెలంగాణకు చరిత్ర అని చెప్పడం సామాన్యుడిని కలతకు గురిచేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్క హిందువూ డిసెంబర్‌ 7న బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల భద్రతకు ఎవరైతే భరోసాగా ఉంటారో వారికే ఓటు వేయాలని పరిపూర్ణానంద సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories