స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Mon, 11/12/2018 - 10:45

హైదరాబాద్ పేరు మార్చి కొత్త పేరు పెడతాం తెలంగాణలో కొన్ని పట్టణాల పేర్లు మార్చేస్తాం..  ఇది విన్నాక అవునా.. నిజమా అన్న సందేహం వస్తుందా..? అవును తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో పలు ప్రాంతాల పేర్లను మార్చి కొత్త పేర్లను పెడతామని రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు.. ఇంతకీ ఎవరా నేతలు.. ఏంటా కథ.. తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. 

తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాల్లో చాలా బిజీ అయిపోయారు ఎవరికి నచ్చిన హామీలు వారిస్తూ ప్రజల మనసును గెలుచుకునే పనిలో పడ్డారు నేతలు. అయితే బీజేపీ నాయకులు స్వామిపరిపూర్ణానంద, గోషామల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే పనిలో పడ్డారు అయితే కాస్త డిఫరెంట్ హామీలు ఇస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు.

తాజాగా వికారాబాద్‌ జిల్లా తాండూరు సభలో పాల్గొన్న పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకొచ్చాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల పేర్లను మారుస్తామని ప్రకటించారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ పేర్లను మార్చనున్నట్టు తెలిపారు. 

ఇక అంతక ముందు భారతీయ జనతా పార్టీ నాయకుడు గోషామహల్ మాజీ ఎం ఎల్ ఏ రాజా సింగ్ కూడా హైదరాబాద్ పేరును మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు భాగుమతి పేరుమీద భాగ్యనగరం ఏర్పడిందని అది కాలక్రమేనా హైదరాబాద్ గా మారిందన్న రాజాసింగ్ తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను తిరిగి భాగ్యనగరంగా మార్చేస్తామని పేర్కొన్నారు. మొత్తానికి కమలనాధులు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రచారంలో కొత్త కొత్త హామీలు ఇస్తూ దూసుకు పోతున్నారు.

English Title
Swami Paripoornananda Sensational Comments in Tandur Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES