పరిపూర్ణానందకు అమిత్ షా పిలుపు...తెలంగాణ సీఎం అభ్యర్థి...

పరిపూర్ణానందకు అమిత్ షా పిలుపు...తెలంగాణ సీఎం అభ్యర్థి...
x
Highlights

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా..? ఉత్తరప్రదేశ్‌కు యోగి ఆదిత్యనాథ్‌లాగే... తెలంగాణకూ ఓ యోగిని బీజేపీ తెరపైకి తేబోతోందా..? ఇటీవల...

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుందా..? ఉత్తరప్రదేశ్‌కు యోగి ఆదిత్యనాథ్‌లాగే... తెలంగాణకూ ఓ యోగిని బీజేపీ తెరపైకి తేబోతోందా..? ఇటీవల వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ స్వామీజీ బీజేపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? ఆయనే తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీజేపీలో జరగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందకు బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ పెద్దల పిలుపుతో ఢిల్లీ చేరుకున్న పరిపూర్ణానంద ఇవాళ కమల దళాధిపతి అమిత్ షా భేటీకానున్నారు. దీంతో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజీకీయాలు మరింత వేడెక్కాయి. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ స్వామి పరిపూర్ణానందపై దృష్టి పెట్టింది. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటే లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే పరిపూర్ణానందకు బీజేపీ కండువా కప్పాలని పట్టుదలగా ఉన్నారు. ఈ అంశం గురించి మట్లాడటానికే పరిపూర్ణానందను అమిత్ షా హస్తినకు రమ్మని కబురు సంపారని ప్రచారం జరుగుతోంది. స్వామి బీజేపీలో చేరడం ఖాయమని.. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ సీఎం అభ్యర్థిగా కాకపోయినా... ఎంపీగానైనా ఆయన్ను బరిలోకి దింపుతారని బీజేపీ వర్గాల సమాచారం.

నిజానికి పరిపూర్ణానంద రాజకీయ అరంగేట్రంపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. పైగా తన రాజకీయ ప్రవేశంపై స్వామి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరే విషయమై తన నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని మీడియాతో అన్నారు. తన జీవితంలో ఏ నిర్ణయమైనా అమ్మవారిదే అన్న ఆయన.. దేశం, ధర్మం కోసం పని చేస్తానని తెలిపారు. అందరితో సంప్రదింపులు చేస్తున్నానని.. అన్నిటిపై కూలంకషంగా చర్చించాకే అడుగులు వేస్తానన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆహ్వానిస్తే గనుక నిస్వార్థంగా దేశం, ధర్మం కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.

గతంలో పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యాలు... తాజాగా ఆయను బీజేపీ హైకమాండ్ నుంచి ఆహ్వానం అందడం చూస్తే.. ఆయన బీజేపీలో చేరికకు మార్గం సుగమం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ పరిపూర్ణానంద బీజేపీలో చేరితే..ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. పరిపూర్ణానందక ప్రచారం నిర్వహణ బాధ్యలతో పాటు...పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories