బాబు గోగినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ట: పరిపూర్ణానంద స్వామి

Submitted by arun on Mon, 07/02/2018 - 16:12
swami

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరినో ఒకరిని వివాదాల్లోకి లాగి, సంచలనాలు చేస్తూ బతికే వారు ఎక్కువ అయ్యారని, అందులో బాబు గోకినేని ఉన్మాది అయితే కత్తి మహేష్‌ దానికి పరాకాష్ఠని అన్నారు. రామాయణాన్ని, మహాభారతాన్ని ఒక కథ అని వ్యాఖ్యనించడం బాధాకరమన్నారు. కత్తి మహేష్ ఎవరికో అమ్ముడుపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తెున్నారని అన్నారు. హిందువు కాని వ్యక్తి పవిత్ర హిందూ గ్రంధాలపై ఎలా విమర్శలు చేస్తాడని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కత్తి మహేష్‌ను వెంటనే అరెస్టు చేయాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. అతని చేత హిందువులకు క్షమాపణ చెప్పించాలి. లేని పక్షంలో ప్రభుత్వాలు హిందువుల ఆగ్రహానికి గురవుతాయి అని హెచ్చరించారు. కత్తి మహేష్‌ కు అవసరం అయితే ముస్లిం, క్రిస్టియన్‌ గ్రంథాలపై కామెంట్‌ చేసుకోమనండి. మా హిందు దేవుళ్ళు, దేవతలు, గ్రంథాల జోలికి వస్తే ఖచ్చితంగా సహించేది లేదని తేల్చి చెప్పారు. మేము నమ్ముకున్న గ్రంథాలను, దేవుళ్ళును మేము విశ్వసిస్తాం. కత్తి మహేష్‌ లాంటి నాస్తికులు వెళ్ళి గంగలో దూకండి అని మండిపడ్డారు.

English Title
swami paripoornananda fires on kathi mahesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES