కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై వేటు తప్పదా..?

x
Highlights

పార్టీ పెద్దలపై నోరు పారేసుకుని షోకాజ్‌ నోటీసులతో చేతులు కాల్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. రెండు...

పార్టీ పెద్దలపై నోరు పారేసుకుని షోకాజ్‌ నోటీసులతో చేతులు కాల్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. రెండు నోటీసులు అందుకొని మరీ వివరణ ఇవ్వకుండా ఉన్న రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటారా..? పార్టీ పెద్దలపై కనీస గౌవరం లేకుండా మాట్లాడటం ఏ మాత్రం క్షమార్హం కాదని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కోమటిరెడ్డిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హద్దు దాటారని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం కూడా రాజగోపాల్‌ వాడిన భాషను తీవ్రంగా ఆక్షేపించింది. కోదండరెడ్డి నేతృత్వంలో భేటీ అయిన క్రమశిక్షాన సంఘం ఆయన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. దాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపించింది. పార్టీ ప్రయోజనం పేరుతో మితిమీరిన స్వేచ్ఛతో రాజగోపాల్‌ వాడిన భాషను రాహుల్‌గాంధీకి లిఖితపూర్వకంగా పంపించారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్రనష్టం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యలు ప్రత్యర్థులకు లాభం చేకూర్చేవిదింగా ఉందని ఇక ఉపేక్షించడం ఏమాత్రం భావ్యం కాదని.. తీర్మానంలో పేర్కొన్నారు.

ఇక రాహుల్‌గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రాజగోపాల్‌రెడ్డిపై వేటు తప్పదని తేల్చిచెబుతున్నారు. ఇకముందెవరూ ఇలా ఇష్టానుసారం మాట్లాడితే వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెబుతన్నారు. అలాంటి వారికి ఇదో హెచ్చరికలాగా పనిచేస్తుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories