పాక్ జ‌ట్టుతో క్రికెట్ ఆడ‌డం కుద‌ర‌దు : సుష్మా

పాక్ జ‌ట్టుతో క్రికెట్ ఆడ‌డం కుద‌ర‌దు : సుష్మా
x
Highlights

పాక్ - భార‌త్ క్రికెట్ మ్యాచ్ లు ఇప్ప‌ట్లో జ‌రిగే దాఖ‌లాలు ఏం క‌నిపించేలా లేవు. స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో దేశం త‌రుపున పాక్...

పాక్ - భార‌త్ క్రికెట్ మ్యాచ్ లు ఇప్ప‌ట్లో జ‌రిగే దాఖ‌లాలు ఏం క‌నిపించేలా లేవు. స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో దేశం త‌రుపున పాక్ లో క్రికెట్ ఆడ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పుకోవాలి. అయితే నువ్వా నేనా అని త‌ల‌ప‌డే భార‌త్ - పాక్ ల మ‌ధ్య పూర్తిస్థాయి సిరీస్ 2007లో జ‌రిగింది. ఆ త‌రువాత డిసెంబ‌ర్ 2012లో పాక్ జ‌ట్టు భార‌త్ కు వ‌చ్చి ఆడింది. అయితే ఇరు దేశాల‌మ‌ధ్య మ్యాచ్ లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ అభిమానులు భావించారు. ఇటీవ‌ల‌ కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబంతో పాటు కాల్పుల విమరణ ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్‌తో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో మండి ప‌డ్డ విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఎట్టిప‌రిస్థితుల్లో పాక్ తో భార‌త్ మ్యాచ్ ఆడేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. కాల్పుల‌కు పాల్ప‌డుతున్న త‌రుణ‌లో ఇరుదేశాలు క్రికెట్ ఆడ‌డం స‌రైంది కాద‌ని క‌న్స‌ల్టేటీవ్ క‌మిటీ స‌మావేశంలో వెల్ల‌డించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories