చంద్రుడిపై స్థలం కొన్న హీరో.. ఎకరం రూ.2,300 మాత్రమే

Submitted by arun on Fri, 06/29/2018 - 13:09
moon

భూమిపై స్థలాల ధరలకు రెక్కాలొచ్చాయి. కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చోంటున్నాయి. ఒకవేళ తక్కువ రేట్లకు స్థలాలు దొరికితే కొనేవాళ్ళ క్యూ  చాలా ఉంటుంది. కాగా ఓచోట కేవలం రూ. 2,300 వేలతో ఎకరం భూమి లభిస్తోంది. ఏంటీ రూ.2,300లకే ఎకరం స్థలమా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఇది నిజం...కానీ పై రేటుకే ఎకరం జాగా లభిస్తోంది. ఎక్కడో తెలుసా.. చంద్రునిపై...ఓ యంగ్ హీరో. ఈ రికార్డును కైవసం చేసుకున్న ఆ హీరో ‘ ఎంఎస్. ధోని’ సినిమా ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అక్కడ మూడు ఎకరాల స్థలం కొన్నాడు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థ ద్వారా స్థలం కొన్నట్లు స్వయంగా తెలిపాడు. చంద్రుడిపై, అరుణగ్రహంపై ఆస్తులు అమ్ముతామని చాలా కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి.

చంద్రుడిపై ఎకరా స్థలం కేవలం రూ.2,300కే అమ్ముతామని ‘ఓయ్‌ హ్యాపీ’ అనే కంపెనీ చెబుతోంది. చంద్రుడిపై స్థలం కావాలనుకునే వారు ఒక ఫారం నింపి ఇస్తే చాలు.. చంద్రుడిపై స్థలం వివరాలతో కూడిన ఓ సర్టిఫికెట్‌ ఇస్తామని  ఆ కంపెనీ అధికార ప్రతినిధి ఆరిఫ్‌ హుస్సేన్‌ పేర్కొంటున్నారు. అయితే దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుందని, నిజంగా దీనిపై హక్కులు ఉండవన్నారు. రోజుకు దాదాపు 30 కొనుగోళ్లు జరుగుతున్నాయని, వాలంటైన్స్‌ డే, మదర్స్‌ డే వంటి రోజుల్లో ఈ కొనుగోళ్లు మరింత పెరుగుతున్నాయన్నారు.

English Title
sushant singh rajput buys plot land moon

MORE FROM AUTHOR

RELATED ARTICLES