బంగ్లాదేశ్ టార్గెట్ 315

బంగ్లాదేశ్ టార్గెట్ 315
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలుచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత 50 ఓవర్లో తొమ్మిది వికెట్లకు గాను 314...

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలుచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత 50 ఓవర్లో తొమ్మిది వికెట్లకు గాను 314 పరుగులు చేసింది . ముందుగా భారత ఓపెనర్లు రోహిత్ మరియు రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు . రోహిత్ ఏకంగా ఈ టోర్నీలో నాలుగో సెంచరీ బాదేసాడు . ఇద్దరు కలిసి 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు . అ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (26), హార్దిక్ పాండ్య (0)లను బంగ్లా లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఒకే ఓవర్లో వెనుకకి పంపాడు .. అ తర్వాత ధోని మరియు రిషబ్ పంత్ కొద్దిసేపు క్రీజ్ లో నిలదొక్కుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు . ఈ క్రమంలోనే భారత్ 300 పరుగులను అందుకుంది . ఇక తర్వాత వచ్చిన బాట్స్ మెన్స్ కూడా పెద్దగా రాణించకపోవడంతో భారత్ వెనువెంటనే వికెట్స్ ని కొల్పవాల్సి వచ్చంది . బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ ఐదు వికెట్లు తీసాడు ..

Show Full Article
Print Article
Next Story
More Stories